: క్రికెటర్ల దుస్తుల్లో సీఆర్పీఎఫ్ క్యాంపులో ప్రవేశించిన ఉగ్రవాదులు..!
కాశ్మీర్లో ఈరోజు చోటు చేసుకున్న ఉగ్రదాడికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. టెర్రరిస్టులు క్రికెటర్ల దుస్తుల్లో సీఆర్పీఎఫ్ శిబిరంలోకి ప్రవేశించారని కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఆర్కే సింగ్ వెల్లడించారు. సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడి స్కూలు పిల్లలతో క్రికెట్ ఆడుతుండగా, ఇద్దరు వ్యక్తులు క్రికెటర్ల వేషంలో అక్కడికి వచ్చినట్టు స్థానికులు తెలిపారు.
వారివద్ద ఉన్న క్రికెట్ కిట్ బ్యాగ్ లో దాడికి ఉపయోగించిన ఆటోమేటిక్ రైఫిళ్లు తీసుకువచ్చి ఉంటారని కాశ్మీర్ పోలీసులు అనుమానిస్తున్నారు. వచ్చీ రావడంతోనే జవాన్లపై దాడికి తెగబడిన ఈ ఇద్దరినీ భద్రతా దళాలు కాల్చి చంపాయి.