: రైల్వే ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి
అనంతపురం జిల్లా కొత్త చెరువు రైల్వే స్టేషన్ వద్ద నాందేడ్ ఎక్స్ ప్రెస్ రైలు ఏసీ బీ-1 బోగీలో మంటలు చెలరేగి ఇద్దరు చిన్నారులు సహా 23 మంది సజీవ దహనమయిన ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని కలెక్టర్, ఎస్పీలను సీఎం ఆదేశించారు. క్షత గాత్రులను మెరుగైన వైద్యం కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించాలని అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలంలో పరిస్థితిని మంత్రి రఘువీరారెడ్డి, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి పరిశీలిస్తున్నారు.