: మందుతో మగువలకే ప్రమాదం ఎక్కువట


మందుబాబులం, మేము మందుబాబులం... అంటూ మగవారు ఈ వార్త విని హాయిగా పాడుకోవచ్చు. ఎందుకంటే మందు వల్ల మగవారికన్నా మగువలే ఎక్కువగా అనారోగ్యం పాలవుతారట. మందు తాగే మగవారితో పోల్చితే మగువలే ఎక్కువగా అనారోగ్యానికి గురవుతారని, వారిలోనే కాలేయం పాడైపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక పరిశీలనలో మద్యపానం వల్ల మగువల్లో కాలేయం త్వరగా పాడైపోయే ప్రమాదం ఉందని తేలింది. పురుషులతో పోలిస్తే దేహదారుఢ్యం విషయంలో మగువలు చాలా దుర్భలంగా ఉంటారు. వారి శరీరంలో నీటి శాతం కూడా తక్కువగా ఉంటుంది. ఈ కారణాలవల్ల మద్యపానానికి అలవాటుపడిన మహిళల కాలేయం త్వరగా దెబ్బతింటుందని అమెరికన్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ హోవార్డ్‌ మన్‌సూర్‌ చెబుతున్నారు. మితిమీరి మందుతాగే అలవాటు ఉంటేనే కాలేయం దెబ్బతింటుంది అనుకుంటే పొరబాటేనని, నిజానికి జన్యుపరంగా దుర్భలుడైన వ్యక్తి మోతాదు ప్రకారం మందుతాగినా కూడా వారి కాలేయం పాడైపోతుందని ఆయన చెబుతున్నారు. కాబట్టి మందువల్ల మగువలే అనారోగ్యం పాలవుతారు అని అపోహ పడకుండా శారీరకంగా బలహీనంగా ఉండే మగవారు కూడా మందుకు దూరంగా ఉంటే మంచిదే!

  • Loading...

More Telugu News