: చంద్రబాబును కలిసిన ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల
తెలుగుదేశం అధినేత చంద్రబాబును, ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల హైదరాబాదులో ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మహిళల రక్షణ కోసం తాను రూపొందించిన 'ప్రాజెక్ట్ చైత్ర'కు సంబంధించిన పలు కార్యక్రమాలను చంద్రబాబుకు వివరించారు. 'ప్రాజెక్ట్ చైత్ర' ద్వారా ఆపదలో ఉన్న మహిళలకు 24 గంటలపాటు అందుబాటులో ఉండే హెల్ప్ లైన్ ను శేఖర్ కమ్ముల, మధుర శ్రీధర్ తదితరులు రూపొందించారు. ఈ హెల్ప్ లైన్ కు ఫోన్ చేస్తే పోలీసు, ఆసుపత్రి తదితర శాఖలకు ఒకేసమయంలో సమాచారం అందుతుందని శేఖర్ కమ్ముల తెలిపారు. మహిళల భద్రతకు ఉపయోగపడే ఈ తరహా కార్యక్రమాన్ని రాబోయే ఎన్నికలకు తెలుగుదేశం మానిఫెస్టోలో పెట్టడం ద్వారా వారి భద్రతకు భరోసా కల్పించవచ్చునని చంద్రబాబుకు వివరించినట్టు ఆయన చెప్పారు.