: జగన్ రిమాండ్ ఈ నెల 20 వరకు పొడిగింపు


అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఈ నెల 20 వరకు రిమాండ్ పొడిగించారు. ఈ మేరకు సీబీఐ కోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, జగన్ తో పాటు ఈ కేసులో ఆరోపణలెదుర్కొంటున్న మాజీ మంత్రి  మోపిదేవి, మాట్రిక్స్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డి తదితరులకు కూడా ఈ నెల 20 వరకు సీబీఐ కోర్టు రిమాండ్ విధించింది. న్యాయస్థానం వీరందరినీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. 

  • Loading...

More Telugu News