: రాహుల్ ఎదుట సమైక్యవాదాన్ని వినిపించిన సీఎం కిరణ్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన సమైక్యవాదాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వద్ద కూడా వినిపించారు. పార్టీ ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం ఢిల్లీలో రాహుల్ తో కిరణ్ రెండుసార్లు సమావేశమయ్యారు. మొత్తం 45 నిమిషాల పాటు రాష్ట్రంలోని వివిధ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏపీని సమైక్యంగా ఉంచి కాంగ్రెస్ ను పరిరక్షించాలని కోరారు. విభజన వల్ల ఇరు ప్రాంతాలకు జరిగే నష్టాలను కిరణ్ పూసగుచ్చినట్లు వివరించారు.
కిరణ్ చెప్పిన వివరాలను రాహుల్ ఆసక్తిగా విన్నట్టు తెలుస్తోంది. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలైన 'మీసేవ'ను రాహుల్ మెచ్చుకుని ఆ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రజోపయోగమైన సేవలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని సీఎంకు సూచించారు.