: 70 పరుగుల వద్ద పుజారా ఔట్
డర్బన్ లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజును... ఒక వికెట్ నష్టానికి 181 పరుగులతో ప్రారంభించిన భారత్ పుజారా వికెట్ ను కోల్పోయింది. 70 పరుగులు (9 ఫోర్లు) చేసిన పుజారా స్టెయిన్ బౌలింగ్ లో డీవిలియర్స్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 198 పరుగులు. అంతకు ముందు ఆటకు వర్షం అడ్డంకిగా నిలవడంతో... రెండు గంటలకు పైగా ఆట ప్రారంభం కాలేదు.