: చంద్రబాబు సమైక్యానికి అనుకూలంగా ఎందుకు లేఖ ఇవ్వడం లేదు: జగన్
సమైక్యాంధ్రకు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఎందుకు ఇవ్వడం లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా పత్తికొండలో జరిగిన సమైక్య శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజిస్తే నీళ్ల కోసం రైతులు, ఉద్యోగాల కోసం విద్యావంతులైన సీమాంధ్ర ప్రజలు ఎక్కడికి వెళ్లాలని అన్నారు. అంతా ఒక్కటిగా నిలిస్తేనే సమైక్యాంధ్ర సాధ్యమని అన్నారు. 30 ఎంపీ స్థానాలను గెలిపించుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుదామని జగన్ పిలుపునిచ్చారు.