: ఆ వ్యాఖ్యలు కొన్ని పత్రికల వక్రీకరణే: అంబటి రాంబాబు


అసెంబ్లీ స్పీకర్ పై వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలని కొన్ని పత్రికలు వివాదాస్పదం చేశాయని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ స్పీకర్ వంటి అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయాలకు తలొగ్గి అసెంబ్లీని నడిపిస్తున్నారని మండిపడ్డారు. గతంలో రాష్ట్రాల విభజన జరిగిన విధానంలో అవలంబించిన విధానం ఏంటి? ఇప్పుడు అనుసరిస్తున్న విధానం ఏంటి? అని అడుగుతూ ఆ మాత్రం బుద్ధి లేదా? అని జగన్ ప్రశ్నించారని, అంతే కానీ స్పీకర్ స్థానాన్ని తూలనాడాలన్నది ఆయన ఉద్దేశం కాదని రాంబాబు స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి శాసన సభ్యులు రాజీనామా చేసినప్పడు ఉద్దేశపూర్వకంగా నాన్చుడు ధోరణితో ఎన్నికలను ఆపలేదా? అని ఆయన నిలదీశారు.

  • Loading...

More Telugu News