: భార్యపై అనుమానంతో కూతురుపైనే అకృత్యం


బంధాలు మసిబారుతున్నాయి. అసూయ, ద్వేషాలు మనుషుల్లోని క్రూరత్వాన్ని పెంచుతున్నాయి. వావివరుసలు మరచి భార్యపై కసితో కన్న కూతురిపైనే లైంగిక దాడి చేశాడో కీచక తండ్రి. హైదరాబాద్ లోని చిలకలగూడ దగ్గర సీతాఫల్ మండిలోని మేడిబావిలో ఆటోడ్రైవర్ రాజు(34) తన భార్య, ఇద్దరు కుమార్తెలతో నివాసముంటున్నాడు. భార్యపై అనుమానం పెంచుకున్న రాజు ఆమెను వేధిస్తూ ఒకటో తరగతి చదువుతున్న పెద్ద కుమార్తెపై లైంగికదాడికి పాల్పడుతున్నాడు.

చిన్నారి కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో తల్లి మందులు తెచ్చిచ్చింది. అప్పటికీ తగ్గకపోవడంతో తల్లి బాలికను గట్టిగా అడిగింది. దీంతో తనపై తండ్రి చేస్తున్న దాష్టీకాన్ని బయటపెట్టింది. విషయం తెలుసుకున్న ఆమె భర్తను నిలదీయడంతో అతను చిన్న కూతుర్ని తీసుకుని పారిపోయాడు. దీంతో ఆమె భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, రాజు కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News