: అమెరికా అధికారులతో భారత కొత్త రాయబారి చర్చలు
అమెరికాలో భారత నూతన రాయబారిగా నియమితులైన ఎస్. జైశంకర్ అక్కడి ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. విదేశీ వ్యవహారాల కార్యదర్శి, ప్రొటోకాల్ వ్యవహారాల కార్యదర్శులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా భారత దౌత్యాధికారి దేవయాని ఖోబ్రాగాదెపై అన్యాయంగా మోపిన కేసు విషయంలో భారత ఆందోళనను తెలియపరిచారు. దేవయానిపై మోపిన అభియోగాలను రద్దు చేయాలని కోరారు.