: ఇకనుంచి ఏసీ బస్సు సర్వీసుల్లో భోజన సదుపాయం: ఆర్టీసీ
దూరప్రాంత ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏసీ బస్సు సర్వీసుల్లో భోజన సదుపాయాన్ని కల్పించేందుకు ఆర్టీసీ పూనుకుంది. ఈ మేరకు 'డిన్నర్ ఆన్ బోర్డ్' పేరిట ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సదుపాయం రేపటి నుంచే అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది. హైదరాబాదు నుంచి బయల్దేరే 15 ఏసీ బస్సుల్లో మొదట ఈ సదుపాయాన్ని ప్రారంభిస్తున్నారు. వెన్నెల, గరుడ, గరుడ ప్లస్ లో ప్రయాణానికి నాలుగు గంటలు ముందుగా భోజనాన్ని ఫోన్ ద్వారా ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చని వివరించింది.