: 20 ఏళ్ల యువతి అపహరణ, అత్యాచారం.. తర్వాత మరోసారీ అదే


కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని కరైకల్ లో 20 ఏళ్ల తమిళనాడు యువతి కామాంధుల చేతుల్లో లైంగిక దాడికి గురయ్యింది. బాధితురాలు తమిళనాడులో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 24న స్నేహితురాలు రాణితో కలిసి కరైకల్ వచ్చింది. అక్కడ రాణి, ఆమె బోయ్ ఫ్రెండుతో కలిసి సైట్ సీయింగ్ కు వెళ్లింది. రాణికి అస్వస్థతగా ఉండడంతో వారందరూ స్నేహితుడి ఇంటికి వెళ్లారు. ఇది గమనించిన ముగ్గురు తమిళనాడు యువతిని అపహరించి మారుమూల ప్రదేశానికి తీసుకెళ్లారు. వారిలో ఒకడు అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను రాణి, ఆమె స్నేహితులు గుర్తించి తీసుకెళుతుండగా.. మరో ఏడుగురు యువకులు అడ్డగించి ఆమెను అపహరించి తీసుకెళ్లారు. వారిలో ఆరుగురు అత్యాచారం చేసి వదిలేసి వెళ్లారు. పోలీసులు 10 మందిని అరెస్ట్ చేయగా.. మరికొంత మంది పరారీలో ఉన్నారు.

  • Loading...

More Telugu News