: విచారణకు సహకరించనందుకే అరెస్టు: డీసీపీ
ఎమ్మెల్యే శంకర్ రావు అరెస్ట్ విషయంలో అనుసరించిన తీరును తప్పుపడుతూ నలువైపుల నుంచి నిరసనలు వస్తుండడంతో పోలీసులు వివరణ ఇచ్చారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా శంకర్ రావు విచారణకు సహకరించడం లేదనీ, అందుకే అదుపులోకి తీసుకున్నామనీ డిప్యూటీ పోలీసు కమిషనర్ శివకుమార్ మీడియాకు తెలిపారు.
అదుపులోకి తీసుకునే ముందు దుస్తులు మార్చుకోమని ఎన్నిసార్లు కోరినా ఆయన అంగీకరించకుండా, అలానే వస్తానని తేల్చి చెప్పారని డీసీపీ వెల్లడించారు. పోలీసుల విధులను అడ్డుకున్నందుకు, దుర్బాషలాడినందుకు శంకర్ రావుపై ముషీరాబాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసామని చెప్పారు. ఆయన కోలుకున్న తరువాత విచారణ కొనసాగిస్తామని ఆయన తెలిపారు.