: కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి రామ్ లీలా మైదానంలో ఏర్పాట్లు


ఢిల్లీలో రేపు(శనివారం) ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్ లీలా మైదానంలో సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకారం కోసం భారీ వేదిక కూడా ఏర్పాటు చేస్తున్నారు. కేజ్రీవాల్ సహా 28 మంది పార్టీ సభ్యులు ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు, అభిమానులు, ఇతరులు హాజరవుతారు. మరోవైపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను హాజరవడం లేదని కిరణ్ బేడీ తెలిపారు. ముందే నిర్ణయమైన కొన్ని కార్యక్రమాల వల్ల తాను హాజరుకాలేనని, ఆ రోజు తాను బెంగళూరులో ఉంటానని చెప్పారు. అయితే, తనకు ఏఏపీ నుంచి ఎలాంటి ఆహ్వానపత్రం అందలేదన్నారు.

  • Loading...

More Telugu News