: కేజ్రీవాల్ ను ఇరకాటంలో పడేసిన కాంగ్రెస్


మాంచి దూకుడుమీదున్న కొత్త రాజకీయవాది, సామాన్యుల నేతగా భావిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ కు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ సర్కారు చిన్న ఝలక్ ఇచ్చింది. ఢిల్లీలో వాహనాలకు వాడే గ్యాస్ ధరను కిలోకు 4.5రూపాయలు పెంచి ఇరకాటంలోకి నెట్టేసింది. ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యలో భాగంగా బస్సులు, ఆటోలకు సీఎన్ జీ ఇంధనాన్ని వినియోగిస్తున్నారు. ఇప్పుడు గ్యాస్ ధర పెరగడంతో ప్రయాణికులపై భారం పడనుంది. దీంతో కేజ్రీవాల్ గద్దెనెక్కకుండానే బాదుడు మొదలెట్టారా? అన్న సందేశం ప్రజల్లోకి వెళుతుంది. ఇప్పటికే ఆటోవాలాలు చార్జీల పెంపుపై సమ్మెకు దిగుతామని ప్రకటించారు.

కేంద్రం ఈ సమయంలో గ్యాస్ ధరను పెంచడంలో మర్మమేంటో? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. అసలెందుకు పెంచారో తాను గద్దెనెక్కాక పరిశీలిస్తానన్నారు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని సందేహం వ్యక్తం చేశారు. దయచేసి రెండు రోజుల సమయం ఇవ్వాలని ఆటో డ్రైవర్లను కోరారు. ఆటోవాలాలతో సమావేశం ఏర్పాటు చేసి కారణాలను ఆన్వేషించాక.. తప్పనిసరైతే చార్జీల పెంపునకు అనుమతిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News