: ఎర్రగడ్డ వద్ద బస్సు నుంచి జారిపడి ప్రయాణికుడి మృతి
హైదరాబాదులోని ఎర్రగడ్డ వద్ద ఈ రోజు (గురువారం) సాయంత్రం ఆర్టీసీ బస్సు నుంచి జారిపడి ప్రయాణికుడు దుర్మరణం పాలయ్యాడు. బస్సు కోఠి నుంచి పటానుచెరు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.