: వచ్చే నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరతా: పెద్దిరెడ్డి
వచ్చే నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే వ్యతిరేకంగా ఓటు వేస్తానని చెప్పారు. పెద్దిరెడ్డి ఈ ఉదయం చంచల్ గూడ జైలులో జగన్ ను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై జగన్ ను అన్యాయంగా జైల్లో పెట్టాయని ఆరోపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాల అమలు జగన్ వల్లే సాధ్యమన్నారు.