: ప్రజల ఆకాంక్ష మేరకే కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు: కడియం శ్రీహరి


రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ పొత్తు ఉంటుందని ఆ పార్టీ నేత కడియం శ్రీహరి చెప్పారు. ఏ పార్టీతో పొత్తు లేకున్నా టీఆర్ఎస్ కు నష్టం లేదని అన్నారు. ఈ రోజు ఆయన వరంగల్ లో మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని... ఆయన దృష్టిలో సమన్యాయం అంటే ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ తెలంగాణ ప్రాంత నేతలు ఎర్రబెల్లి, మోత్కుపల్లి చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

  • Loading...

More Telugu News