: హైదరాబాదు జీహెచ్ఎంసీ లో సమ్మె సైరన్
హైదరాబాదు మహానగర పాలక సంస్థలో కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. ఈరోజు (గురువారం) అర్థరాత్రి నుంచి సమ్మె చేస్తున్నట్లు గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రకటించింది. తమ సమస్యలను గతంలోనే ప్రభుత్వానికి విన్నవించామని.. డిమాండ్లను నెరవేరుస్తామంటూ హామీ కూడా ఇచ్చిందని వారు గుర్తు చేశారు. తమ సమస్యలను పరిష్కరించేవరకూ విధులకు హాజరయ్యేది లేదని వారు స్పష్టం చేశారు. ఈ సమ్మెలో మొత్తం 20 వేల కార్మికులు పాల్గొంటున్నారు.