: కాంగ్రెస్ అసమర్థతతో చిన్న పరిశ్రమలు తుడిచిపెట్టుకుపోయాయి: చంద్రబాబు


కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతతో రాష్ట్రంలోని చిన్న పరిశ్రమలు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయని... సగానికి సగం తుడిచిపెట్టుకుపోయాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఐదేళ్ల క్రితం 80 వేల పరిశ్రమల ద్వారా 8 లక్షల మంది ఉపాధి పొందారని... ప్రస్తుతం 45 వేల చిన్న పరిశ్రమలతో 4 లక్షల మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న నైపుణ్యాలు స్వల్పకాలంలోనే ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయని... ఉద్యోగుల మెరుగైన భవిష్యత్తు కోసం వారికి సుదీర్ఘ నైపుణ్యంతో కూడిన శిక్షణ ఇప్పించడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.

  • Loading...

More Telugu News