: ఫేస్ బుక్ లో లైక్స్ పెరిగిపోయాయంటూ మాజీ మంత్రి బన్సల్ ఫిర్యాదు
కేంద్ర మాజీ రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్ పోలీసులను ఆశ్రయించారు. కారణం.. ఉన్నట్లుండి ఆయన ఫేస్ బుక్ ఖాతాలో లైక్స్ పెరిగిపోయాయట. దాంతో ఆ దెబ్బకు భయపడ్డ సీనియర్ కాంగ్రెస్ ఎంపీగారు చండీగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక్క రోజులోనే 51 వేల నుంచి 62వేలకు పెరిగాయని, ఇందులో ఏదో తేడా ఉందని ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై సైబర్ పోలీసులు విచారణ జరపనున్నారు. ఇదే విషయమై బన్సల్ విలేకరులతో మాట్లాడుతూ.. ఒక్కరోజులో లైక్స్ మహా అయితే 100 వరకు మాత్రమే పెరుగుతాయి గానీ, 10వేలు పెరగడం అసాధారణమని చెప్పారు.