: చిన్నారుల మనసెరిగి బోధిస్తేనే మంచి ఫలితాలొస్తాయి: హైదరాబాదు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు రాజేందర్


చిన్న పిల్లల మనస్సుకు హత్తుకునేట్లు విద్యా బోధన చేస్తే.. మంచి ఫలితాలు వస్తాయని హైదరాబాదు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు రాజేందర్ చెప్పారు. సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తోన్న పాఠశాలల్లో చదువుకుంటున్న చిన్నారులకు మెరుగైన విద్యాబోధన అందించాలని ఆయన సిబ్బందికి సూచించారు. హైదరాబాదు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ‘విద్యాబోధనలో లోపాలు’ అన్న అంశంపై ఐదు రోజుల సదస్సు ఇవాళ ప్రారంభమైంది. చదువులో వెనుకబడుతున్న విద్యార్థుల విషయంలో ఎలా వ్యవహరించాలన్న విషయంలో జరిగిన చర్చలో పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News