: జగన్ ను అడ్డుకునేందుకు టీ.వాదుల యత్నం
ఈ ఉదయం పదకొండు గంటలకు వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతితో భేటీ అయిన సంగతి తెలిసిందే. భేటీ ముగిసిన అనంతరం తిరిగి వస్తున్న జగన్ కాన్వాయ్ ను అడ్డుకునేందుకు తెలంగాణవాదులు ప్రయత్నించారు. దాంతో, వైఎస్సార్సీపీ, తెలంగాణవాదుల మధ్య తోపులాట జరిగింది. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు తెలంగాణ వాదులను అదుపులోకి తీసుకున్నారు.