: తిరుపతిలో గాలి ఆధ్వర్యంలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’
తిరుపతి పట్టణంలో ఈరోజు ఉదయం ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ప్రారంభించారు. స్థానిక డి.ఆర్.మహల్ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి బయల్దేరిన ఆయన.. గడప గడపకు తిరిగి పార్టీ కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్సీపీ సాగిస్తున్న అక్రమాలను ప్రజల ముందు ఉంచేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గాలి చెప్పారు.