: ఆస్కార్ రేసులో భారతీయ లఘు చిత్రం 'కుష్'


ఇప్పటికే ఆస్కార్ బరి నుంచి భారతీయ చిత్రం 'ద గుడ్ రోడ్' బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, భారతీయుల ఆశలు నీరు గారకుండా ఓ భారతీయ లఘు చిత్రం అకాడమీ అవార్డుల రేసులో పోటీ పడుతోంది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో చోటు చేసుకున్న వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించిన 'కుష్' చిత్రం 'ఉత్తమ యాక్షన్ ఫిల్మ్ కేటగిరీ'లో ఎంపిక చేసిన పది చిత్రాల జాబితాలో నిలిచింది. ఇరవై రెండేళ్ల సుభాషిస్ భుటైనీ ఈ లఘు చిత్రానికి దర్శకత్వం వహించారు. రూ.8 నుంచి రూ.10 లక్షలతో నిర్మించిన ఈ చిత్రానికి పలువురు నిధులు సమకూర్చడం విశేషం. ఇప్పటికే 70వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్, దక్షిణాసియా చలనచిత్రోత్సవం, హాంప్టన్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ఈ చిత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది.

  • Loading...

More Telugu News