: జేసీకి నోటీసులు ఇచ్చాం: దిగ్విజయ్ సింగ్
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే, పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి నోటీసులు ఇచ్చామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. జేసీ నుంచి వివరణ వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడూ సోనియాకు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాంతీయ కమిటీలు వేస్తామని చెప్పారు. వచ్చే నెలలో సీమాంధ్రలోని విశాఖపట్నం, ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తానని డిగ్గీరాజా వెల్లడించారు.