: రాష్ట్రపతిని కలిసిన జగన్, వైఎస్సార్సీపీ నేతలు
హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కొద్దిసేపటి క్రితం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఈ సమయంలో ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనను ఆపాలని ప్రణబ్ ను జగన్ కోరారు. అంతేకాక శాసనసభలో ముసాయిదా బిల్లుపై చర్చ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులను జగన్ ఆయనకు వివరిస్తున్నారు.