: బాలల అదృశ్యంపై మండిపడ్డ సుప్రీంకోర్టు
దేశవ్యాప్తంగా ఏటా 60 వేల మంది బాలలు అదృశ్యమౌతున్నా కేంద్రం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవడం లేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలల రక్షణ కోసం ఆయా ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలపై స్పందించని కేంద్రం, తమిళనాడు, గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులపై సుప్రీంకోర్టు మండిపడింది.
దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను లెక్కచేయనందుకు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. అఫిడవిట్లు దాఖలు చేయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 19 లోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని చివరి అవకాశం ఇచ్చింది.