: గుజరాత్ అల్లర్ల కేసులో మోడీకి క్లీన్ చిట్ ఇవ్వడంపై నేడు తీర్పు


ఓసారి ఏదైనా కేసులో ఇరుక్కుంటే అది జీవితాంతం వెంటాడుతుందంటే ఇదే కాబోలు. 2002లో చోటు చేసుకున్న గుజరాత్ అల్లర్ల ఘటన ఇన్నేళ్లైనా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని వదిలి పెట్టడంలేదు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా ఈ అల్లర్ల కేసు మోడీకి మచ్చగా మిగిలిపోయింది. ఈ క్రమంలో అప్పటి ప్రత్యేక దర్యాప్తు సంస్థ మోడీకి, మరో 58 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ జకియా జఫ్రీ అనే అల్లర్ల బాధితురాలు అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం పిటిషన్ పై విచారణ ముగిశాక తీర్పు నేటికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మేజిస్ట్రేట్ బీజే గణత్రా ఈ రోజు తీర్పు వెలువరించనున్నారు. దాంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గుజరాత్ అల్లర్లలో జకియా భర్త, కాంగ్రెస్ ఎంపీ అయిన ఇషాన్ జఫ్రీ హత్యకు గురయ్యారు.

  • Loading...

More Telugu News