: రబ్బర్ ఫ్యాక్టరీ యజమానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్, గగన్ పహాడ్ లోని రబ్బర్ ఫ్యాక్టరీలో ఈ ఉదయం అగ్నిప్రమాదం సంభవించి నలుగురు సజీవ దహనమయిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఫ్యాక్టరీ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారం చెల్లించేందుకు యజమాని అంగీకరించడంతో మృతుల కుటుంబీకులు కార్మిక సంఘాలతో కలిసి చేస్తున్న తమ ఆందోళనను విరమించారు.