: ఆపరేషన్‌ లేకుండా శుక్లాలను తొలగించవచ్చు


ఇప్పటి వరకూ కంటిచూపును దెబ్బతీసే శుక్లాలు వస్తే ఆపరేషన్‌ ద్వారా వాటిని తొలగించడం చేస్తుంటారు. అయితే, ఆపరేషన్‌ లేకుండా కంటి శుక్లాలను తొలగించే సరికొత్త విధానాన్ని పరిశోధకులు కనుగొన్నారు. ఈ విధానం ద్వారా ఎలాంటి ఆపరేషను లేకుండానే ప్రారంభదశలోని కేటరాక్ట్‌ను తొలగించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

హెరియట్‌`వాట్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం కెటరాక్ట్‌ను తొలగించేందుకు కొత్త లేజర్‌ పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఇప్పటి వరకూ కేటరాక్ట్‌ను తొలగించడానికి డాక్టర్లు శస్త్రచికిత్స చేసి కంటిలోని పైపొరను తొలగించి దాని స్థానంలో ప్లాస్టిక్‌ లెన్స్‌ను అమర్చుతున్నారు. అలాకాకుండా ఈ లేజర్‌ పరికరం ద్వారా కేటరాక్ట్‌ ప్రారంభదశలో ఉన్నప్పుడే దాన్ని తొలగించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకోసం కేటరాక్ట్‌ను ప్రారంభదశలో కచ్చితంగా గుర్తించే పరీక్షను కూడా పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. మరో మూడేళ్లకు ఇది కూడా అందుబాటులోకి వస్తుందని, అప్పుడు లేజర్‌ పరికరంతో కళ్లకు ఎలాంటి శస్త్రచికిత్సలు లేకుండా కేటరాక్ట్‌ను తొలగించవచ్చని, కళ్లకు చేసే ఆపరేషన్లు కూడా తగ్గించవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News