: ఇదో కొత్త రకం కార్పెట్!
మన ఇంటి గుమ్మం ముందు చక్కగా మన పాదాలను తుడుచుకోవడానికి రకరకాల కార్పెట్లను పరుస్తుంటారు. అలాగే బాత్రూంల ముందు కూడా స్నానం చేసి వచ్చిన తర్వాత తడి పాదాలను తుడుచుకోవడానికి మెత్తటి కార్పెట్లను పరుస్తుంటారు. మన ఒంటినుండి కారిన నీటితో కార్పెట్లు తడిచిపోవడం, సరిగా ఆరకపోవడం ఇలాంటి సమస్యలు లేకుండా ఉండేలా, మన ఒంటిపై నుండి కారిన నీటిని కూడా వృధాగా పోనివ్వకుండా ఉండేలా ఒక సరికొత్త కార్పెట్‌ను తయారుచేశారు. ఈ కార్పెట్ అచ్చమైన పచ్చటి నాచుతో తయారుచేయబడింది.
ఇప్పుడు నాచుతో రకరకాల ఆకారాలతో తయారైన కార్పెట్లు మార్కెట్లలో లభిస్తున్నాయి. వీటిని తెచ్చుకుని బాత్రూంల ముందు వేసుకుంటే చక్కగా మన ఒంటిపైనుండి కారిన నీటితో నాచు మొక్కలు బతికేస్తాయి. అంతేకాదు... మన గదిని పొడిగా ఉంచడమే కాకుండా కాలుష్యరహితంగా కూడా ఉంచుతుంది. మొత్తానికి నాచు తివాచీ భలేగా ఉందికదూ!