: అక్కడ వందమందిలో ఆరుగురు మనవారేనట!


దక్షిణాఫ్రికాలో వందమంది ప్రముఖ వ్యక్తుల జాబితాను సేకరిస్తే అందులో ఆరుగురు మనవారే ఉన్నారట. మొత్తం పది కేటగిరీలకు సంబంధించిన ప్రముఖ వ్యక్తుల జాబితాను ప్రఖ్యాత దినపత్రిక ది స్టార్‌ రూపొందించింది. ఈ జాబితాలో ఆరుగురు భారత సంతతికి చెందిన వారే ఉన్నారట.

ఈ జాబితాలో భారత సంతతికి చెందిన గుప్తా కుటుంబానికి చెందిన వారికి స్థానం లభించింది. గుప్తా కుటుంబం వివాదాస్పద కుటుంబంగా పేరొందింది. గుప్తా తన కుమార్తె వివాహం సందర్భంగా అట్టహాసంగా చేసిన ఏర్పాట్లు అప్పట్లో వివాదాస్పదంగా మారాయి. గుప్తా కుటుంబానికి చెందిన జకియా పటేల్‌ (టెలివిజన్‌), ఫరౌక్‌ ఏరే, మహ్మద్‌ సయీద్‌ (ఉత్తరాలు), ఇంతియాజ్‌ సోలిమన్‌ (హీరో), ఇక్బాల్‌ సుర్వే (వ్యాపారం) విభాగాల్లో చోటుపొందారు. ఇలా వార్తల్లోని వ్యక్తుల జాబితాల్లో గుప్తా కుటుంబం మూడవ స్థానంలో నిలవడం గమనార్హం.

  • Loading...

More Telugu News