: సత్తా చాటిన స్టూవర్టుపురం యువకుడు
గుంటూరు జిల్లాకి చెందిన స్టూవర్టుపురం యువకుడు ఓవరాల్ ఛాంపియన్ షిప్ సాధించి స్వర్ణపతకం అందుకొన్నాడు. అఖిల భారత వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో బాపట్ల మండలం స్టూవర్టుపురం గ్రామ వాసి రాగాల వెంకట రాహుల్ మొత్తం మూడు స్వర్ణ పతకాలను సాధించి గుంటూరు జిల్లా ఖ్యాతిని మరింత పెంచాడు. సబ్ జూనియర్స్ విభాగంలో 135 కిలోల బరువు ఎత్తి రికార్డులు సాదించాడు. అంతేకాదు.. క్లీన్ అండ్ జర్క్ లో 155 కిలోల బరువు ఎత్తి రెండు బంగారు పతకాలు సాధించాడు. వీటితో పాటు ఉత్తమ క్రీడాకారుడిగా మరో గౌరవ పురస్కారం కూడా అందుకొన్నాడు.