: మదర్సాగా బోర్డు మార్చుకున్న వివాదాస్పద హీరా ముస్లిం యూనివర్శిటీ


తిరుపతిలో కోట్ల రూపాయలతో అత్యాధునికంగా నిర్మించిన హీరా ముస్లిం యూనివర్శిటీ మరో కొత్త వివాదానికి తెరలేపింది. యూనివర్శిటీపై దర్యాప్తు చేసిన అధికారులు... ఆ యూనివర్శిటీని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని తేల్చేశారు. దీంతో హీరా యూనివర్శిటీ యాజమాన్యం వెంటనే యూనివర్శిటీని మదర్సాగా మార్చేసింది. దీనికి సంబంధించిన కొత్త బోర్డును కూడా ఏర్పాటు చేసింది. దీంతో, స్థానికుల ఆగ్రహావేశాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ సంస్థకు కోట్లాది రూపాయల నిధులు ఎక్కడ నుంచి వచ్చాయో దర్యాప్తు చేయాలని స్థానికులు, హిందుత్వవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయని...దీనివల్ల భవిష్యత్తులో తిరుపతి పవిత్రతకే మచ్చ ఏర్పడే అవకాశం ఉందని వాపోతున్నారు.

  • Loading...

More Telugu News