: 18 తర్వాత సీఎం, బొత్స ఢిల్లీకి పయనం
ఈ నెల 18 తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ మళ్లీ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్ధుల ఖరారు కోసం ఈ మధ్యే ఇద్దరూ హస్తినకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. పలు అంశాలపై చర్చించేందుకు మళ్లీ ఇరువురు దేశ రాజధానికి వెళతారని ప్రభుత్వ, పార్టీ వర్గాలు చెబుతున్నాయి.