: ఆ విద్యార్థులు ‘బంగారు కొండలు‘ కాదు.. ‘బంగారు దొంగలు‘
హైదరాబాదు నగరంలో ఈరోజు ఆరుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటు పడిన వీరంతా.. చదువు పక్కన పెట్టి ‘చైన్ స్నాచింగ్’లు చేశారు. నగర పరిధిలో గొలుసు దొంగతనాలు చేస్తూ.. చివరికు కూకట్ పల్లి పోలీసుల చేతికి చిక్కారు. నిందితుల నుంచి కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.