: గిరిజన ప్రాంతాల్లో మత మార్పిడిని అరికట్టండి: స్వరూపానంద సరస్వతి
హిందూమతం పట్ల ప్రభుత్వానికి శ్రద్ధలేదని శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి ఆరోపించారు. గిరిజన ప్రాంతాల్లో అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న మత మార్పిడిని ప్రభుత్వం అరికట్టాలని కోరారు. విశాఖలో శ్రీకృష్ణ మందిరంలో జరిగిన రాష్ట్ర గిరిజన మహాసభకు హాజరైన స్వరూపానంద ఈ వ్యాఖ్యలు చేశారు. హిందూ మతాన్ని భ్రష్టు పట్టించే నేతలకు ఓట్లు వేయరాదని పిలుపునిచ్చారు. దేవస్థాన భూములను ఇస్లామిక్ సంస్థలకు కేటాయిస్తున్నారని... దీంతో హిందూ మతం పట్ల ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఏంటో తెలిసిపోతోందని విమర్శించారు.