: దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి త్వరలో ఉచిత విద్యుత్
రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన పథకం కింద 666 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు విద్యుత్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత విద్యుత్ అందించేలా పథకాన్ని రూపొందించారు. ప్రతి కనెక్షన్ కోసం 3 వేల రూపాయల కేటాయింపులు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విద్యుత్ సంస్థలతో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. ఈ పథకం ప్రతిపాదనలను అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు.