: ప్రమాణ స్వీకారానికి హజారే, కిరణ్ బేడీలను ఆహ్వానించాం: ఆమ్ ఆద్మీ
అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి సామాజిక కార్యకర్త అన్నా హజారే, కిరణ్ బేడీలను ఆహ్వానించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. కాగా, ఈ నెల 28న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటైన 15 రోజుల్లోగా లోక్ పాల్ బిల్లుకు ఆమోదం తెలుపుతామని కేజ్రీవాల్ తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఆమ్ ఆద్మీ నెరవేరుస్తుందని చెప్పారు.