: వాజ్ పేయిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన మన్మోహన్, అద్వానీ, మోడీ
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి ఇవాళ పలువురు ప్రముఖులు, పార్టీ నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మన్మోహన్ సింగ్ మధ్యాహ్నం 12.30 గంటలకు వాజ్ పేయి నివాసానికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సుమారు 20 నిమిషాల పాటు ఆయనతో మన్మోహన్ ముచ్చటించారు. అనంతరం బీజేపీ సీనియర్ నేత అద్వానీ వాజ్ పేయి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సహా పార్టీ ముఖ్య నేతలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కార్యకర్తలు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు.