: వీణా మాలిక్ పెళ్లి చేసుకుందా?


పాకిస్థాన్ మోడల్, నటి వీణా మాలిక్ పెళ్లి చేసుకున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ మేరకు భాగస్వామితో ఉంగరాలు మార్చుకున్న ఫోటోలను వీణా తన ట్విట్టర్ అకౌంట్ లో పెట్టింది. అంతేకాదు..'ఐ ఫౌండ్ మై సోల్ మేట్... మై ఫ్రెండ్.. మై పార్టనర్!!!' అంటూ ట్వీట్ చేసింది. దీనిని బట్టి వీణా దుబాయ్ కు చెందిన ఓ వ్యాపార వేత్తను ఎమిరేట్స్ కోర్టులో వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి స్నేహితుడి కుమారుడినే ఆమె పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. త్వరలోనే అందరినీ పిలిచి వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేయనుందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News