: క్రిస్మస్ సందర్భంగా జెరూసలేమ్ వెళ్లొచ్చిన జయసుధ


సినీ నటి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ క్రీస్తు ఆరాధకురాలు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈసారి క్రిస్మస్ కు వారం రోజుల ముందే క్రీస్తు పుట్టిన పవిత్ర స్థలం జెరూసలేమ్ వెళ్లొచ్చినట్లు ఆమె తెలిపారు. అక్కడికి వెళ్లొచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ శుభసందర్భంగా హైదరాబాదులోని నీలోఫర్, గాంధీ ఆసుపత్రుల్లోని 1200 మంది రోగులకు పండ్లు పంచిపెట్టినట్లు చెప్పారు. తమ ఇంటిని క్రిస్మస్ ట్రీ, వివిధ రకాల వాటితో సుందరంగా అలంకరించామని, అనంతరం బంధువులతో కలిసి ఇంట్లో విందు చేశామని జయసుధ తెలిపారు. రాత్రికి బంజారా హిల్స్ లోని ఎస్టీ అల్ఫోన్స్ చర్చ్ లో ప్రార్థనలకు హాజరు కానున్నట్టు ఆమె వివరించారు.

  • Loading...

More Telugu News