: 40 సీట్లూ వచ్చేస్తే మోడీ చేతిలో నితీశ్ ఖతం: బీజేపీ నేత గిరిరాజ్


బీహార్ లో బీజేపీ నేత, మాజీ మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీహార్లో బీజేపీ మొత్తం 40 స్థానాలను గెలుచుకుంటే నితీశ్ సంగతి ముగిసినట్లేనన్నారు. అంతేకాదు, మోడీ చేతిలో నితీశ్ చావడం ఖాయమని వ్యాఖ్యానించారు. పాట్నాలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ గిరిరాజ్ ఇలా వివాదాస్పదంగా మాట్లాడారు. గిరిరాజ్ గతంలోనూ నితీశ్ ను పల్లెటూరి మహిళగా అభివర్ణించారు. దీనిపై జేడీయూ నేత అలీ అన్వర్ మాట్లాడుతూ.. వారి భాష తమనేమీ ఆశ్చర్యపరచలేదన్నారు. ఇది బీజేపీ సిద్ధాంతంగా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News