: త్యాగి సోదరుల నివాసాలలో సీబీఐ సోదాలు
హెలికాప్టర్ల కుంభకోణంలో కేసు నమోదు చేసిన వెంటనే సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ ఉదయం త్యాగి, అతని సోదరులు సహా 12 మందిపై, నాలుగు కంపెనీలపై సీబీఐ ఎఫ్ఐ ఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే సీబీఐ అధికారుల బృందాలు త్యాగి సోదరుల నివాసాలలో సోదాలు చేపట్టాయి. మొత్తం 12 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయని సమాచారం.