: నటుడు అలీ తమ్ముడు ఖయ్యూం సురక్షితం


సినీ కమెడియన్ అలీ తమ్ముడు ఖయ్యూంకు ఈ రోజు జరిగిన ప్రమాదంలో చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. తల, చేతికి, కాలుకు అయిన గాయాలకు చికిత్స చేసినట్లు తెలిపారు. కాగా, ఈ ఉదయం 9.30 నిమిషాలకు ఓ చిత్రం షూటింగు కోసం రామోజీ ఫిలింసిటీకి వెళుతుండగా రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం కోహెడ వద్ద ఖయ్యూం ప్రయాణిస్తున్న కారును ఓ టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. దాంతో, వెంటనే అతన్ని దగ్గరల్లోని ఆసుపత్రికి తరలించారు. అటు లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News