: కెనడా వాసులకు చీకటి పండుగ!
ప్రపంచమంతా ఆనందంతో క్రిస్మస్ పండుగ జరుపుకొంటుంటే.. కెనడా వాసులకు మాత్రం ఈ పండుగ ఆవేదననే మిగిల్చింది. అవును, నిజమే.. ఇటీవల మంచు తుపానుతో కెనడా వాసులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కెనడా దేశంలోని క్యూబెక్, టొరంటో ప్రాంతాలు, అమెరికాలోని మిషిగాన్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేక అంధకారం అలముకొంది. కరెంటు, నీటి సరఫరా నిలిచిపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. దానికి తోడు మంచు వానతో చలి మరింత పెరిగిపోయింది. కెనడాలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు రాత్రికి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని అధికారులు అంటున్నారు. మిగతా ప్రాంతాల్లో మాత్రం విద్యుత్ మరమ్మతులకు మూడు రోజుల సమయం పడుతోందంటున్నారు.