: 1200 టన్నుల యాపిల్ పండ్లు మట్టిపాలు
ఒక్క యాపిల్ పండుంటే చాలు ఒక్కరోజుకు ఆరోగ్యం వచ్చినట్లే. మరి అలాంటిది ఉత్తరాఖండ్ లో 1200 టన్నుల మేరకు యాపిల్, బంగాళా దుంపలు ఎవరికి పనికిరాకుండా వృధా అయిపోయాయి. ఈ ఏడాది జూన్ లో ఉత్తరాఖండ్ లో పెను వరదలు వచ్చి 5 వేల మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. కుండపోత వర్షాలకు, వరదలకు రోడ్లన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ పలు మార్గాల్లో రహదారుల పునరుద్ధరణ జరగలేదు. దీంతో మారుమూల ప్రాంతాల నుంచి రవాణా వసతి లేక యాపిల్, బంగాళా దుంపలు కుళ్లిపోయాయి. గుర్రాలపై తరలిద్దామనుకుంటే గిట్టుబాటు కాని పరిస్థితి. దీంతో రైతులు వాటిని చూస్తూ చూస్తూ మట్టిపాలు చేసుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.