: అమెరికాలో కోల్డ్ అలర్ట్.. ఏడు వేల విమానాల రద్దు
మంచు తుపాను దెబ్బకు అమెరికా విలవిల్లాడుతోంది. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. ఈ నేపథ్యంలో మధ్య, ఈశాన్య అమెరికాలో 3.7 లక్షల ఇళ్లు, వ్యాపార సముదాయాల్లో గత మూడు రోజులుగా కరెంట్ లేక అంధకారం నెలకొంది. క్రిస్మస్ వేడుకలను కూడా వీరు చీకట్లోనే జరుపుకునే పరిస్థితి ఏర్పడింది. వాషింగ్టన్, షికాగో, న్యూయార్క్ నగరాలనుంచి ఇక్కడకు రావాల్సిన దాదాపు 7 వేల విమానాలు రద్దయ్యాయి. భారీగా కురుస్తున్న మంచు ధాటికి పలువురు మృతి చెందినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, అమెరికాలో పలు చోట్ల కోల్డ్ అలర్ట్ ప్రకటించారు.